మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు

మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు

వేడుకలకు హాజరైన మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి

కామారెడ్డి, మనోరంజని తెలుగు టైమ్స్: నవంబర్ 25

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంగళవారం మాజీ సర్పంచ్, విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం బాల్ రెడ్డి 67వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. బాల్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మనోహర్ రెడ్డి… ఆయన్ని మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకలో ముత్యపు విరశలింగం (సెట్బ్), రాజులు, దయాకర్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, న్యాయవాది శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ వెంకటేష్, ఆకుల వెంకటేష్, ఎర్ర శ్రీనివాస్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment