ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి: మనోహర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్, కామారెడ్డి – నవంబర్ 30
కామారెడ్డిలోని ఎల్లారెడ్డి గ్రామ దేవస్థానంలో ఆదివారం అయ్యప్పస్వామి దీక్షపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక, ధార్మిక మార్గంలో పయనం సాగించాలి. ఆధ్యాత్మికత మానసిక శాంతిని కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అయ్యప్పస్వామి దీక్షలో 41 రోజులు నియమ నిష్టలతో ఉండటం మంచి పరిణామమని ఆయన అన్నారు.
మనోహర్ రెడ్డి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి గురుస్వాములు ఈశ్వర్ గౌడ్, చంద్రం, శ్రీనివాస్, కిరణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, భీమయ్య, నవీన్, మురళీ, ఆలయ పూజారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.