అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి

National_Voters_Day_Rally_Nirmal
  • జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ
  • ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం: కలెక్టర్
  • ఓటు హక్కుపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన పెంపు
  • ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజల ఉత్సాహం

National_Voters_Day_Rally_Nirmal

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కలెక్టర్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

National_Voters_Day_Rally_Nirmal

నిర్మల్:
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శనివారం నిర్మల్ జిల్లాలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి ధర్మసాగర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, “ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి” అని సూచించారు. విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి, వారు తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి సమగ్ర ప్రణాళికలు అవసరమన్నారు.

విద్యార్థులు ప్లే కార్డులతో ఓటు హక్కు ప్రాముఖ్యతను నినాదాల ద్వారా ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఈఓ పి. రామారావు, తహసిల్దార్లు రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment