- పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద సంఘటన
- పొరపాటున 93,400/- చెల్లించిన జేసీబీ యజమాని శ్రీనివాస్
- ఎస్సై గౌస్ పాషా తక్షణమే స్పందించి అదనంగా చెల్లించిన మొత్తం తిరిగి అందజేశారు
- పోలీసుల నిజాయితీకి సమాజం నుంచి ప్రశంసలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన జేసీబీ వెహికల్‌కు డీజిల్ నింపించుకునే క్రమంలో పొరపాటున 93,400/- రూపాయలు చెల్లించారు. ఈ విషయాన్ని గమనించిన ఎస్సై గౌస్ పాషా అతనికి సమాచారం ఇచ్చి, అదనంగా చెల్లించిన మొత్తం తిరిగి అందజేశారు. ఈ సంఘటన పోలీసుల నిజాయితీని మరోసారి నిరూపించింది.
నాగర్ కర్నూల్ జిల్లా డీఎస్పీ కార్యాలయం పక్కన రెండు నెలల క్రితం పోలీస్ వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో ఈ ఘటన జరిగింది. శ్రీపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన జేసీబీ వెహికల్‌కు 9,400/- రూపాయల డీజిల్ నింపించుకునే సమయంలో పొరపాటున 93,400/- రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించారు.
తరువాత ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ తన లావాదేవీలు చెక్ చేసుకున్నప్పుడు ఈ పొరపాటు గుర్తించారు. వెంటనే ఎస్సై గౌస్ పాషా కు సమాచారం అందించగా, ఆయన తన బృందంతో కలిసి శ్రీనివాస్‌ను సంప్రదించి అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి అందజేశారు.
ఈ ఘటన పోలీసుల నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవలను ప్రతిబింబించిందని స్థానికులు అభినందించారు.