నాగారం మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి – సీఐటీయూ

నాగారం మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి – సీఐటీయూ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కి వినతిపత్రం –

కనీస వేతనం ₹26 వేలుగా ఇవ్వాలన్న డిమాండ్

మనోరంజని తెలుగు టైమ్స్ నాగరం ప్రతినిధి నవంబర్ 12

నాగారం, నవంబర్ 12:
నాగారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ కీసర మండల కార్యదర్శి మరియు నాగారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బంగారు నర్సింగరావు, కార్యదర్శి కట్ట జంగయ్య మాట్లాడుతూ — మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “నాగారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాన్ని ₹26 వేల రూపాయలకు పెంచి ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. కార్మికులకు వారాంతపు సెలవులు అమలు చేయాలి” అని పేర్కొన్నారు. అలాగే, చనిపోయిన కార్మికుల కుటుంబానికి ₹25 లక్షల ఆర్థిక సాయం, దహన సంస్కారాలకు ₹30 వేల రూపాయల సాయం అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కీసర మండల నాయకులు చింతకంది అశోక్, వర్కర్స్ యూనియన్ కోశాధికారి పంబాల లలిత, యూనియన్ నాయకులు జాన్ మోష, మైసయ్య, మొరుగు మనెమ్మ, కట్ట నీరజ, టీ. లక్ష్మీనరసమ్మ, చిందం బాలమని, మలుగురం అశ్విని, జి. మైసయ్య, బొల్లి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment