బోయినిపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 25
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎనుగుల కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత
ఈ సందర్భంగా సర్పంచ్ ఎనుగుల కనకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. చెట్లు ఉంటేనే మానవ మనుగడకు దోహదపడుతుందని, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చెట్లు తోడుగా, నీడగా ఉంటాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోత్తూరి శైలజ, వార్డు సభ్యులు దమ్మ వెంకటరమణ, జోగు శంకర్, పైండ్ల అనిల్, దయ్యాల రేణుక, గోల్కొండ సూరి, బూర పూర్ణిమ, పోలే శేఖర్, గ్రామ కార్యదర్శి శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.