సారంగాపూర్, జూలై 17
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో తాటి, ఈత చెట్ల వనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. చెట్లను నరికివేసినట్లు గుర్తించిన కుమ్మరి నర్సయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో తాటి, ఈత చెట్ల వనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చెట్లను నరికివేసినట్లు గుర్తించిన కుమ్మరి నర్సయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రంగస్వామి మాట్లాడుతూ, తాటి, ఈత చెట్లను నరికివేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తోందని, ఈ వనాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా గీత వృత్తిదారుల సంఘాలు చెట్ల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
నిందితుడిని విచారించి కేసు నమోదు చేసినట్లు, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై అభిషేక్‌తో పాటు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












