అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, నిర్మల్ జిల్లా బాసర జోన్కు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుంకరి అలేఖ్యను ఉత్తమ ఫారెస్ట్ అధికారిణిగా గుర్తించి, హైదరాబాద్లో ప్రశంసా పత్రంతో సత్కరించారు.
అడవుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ రంగాలలో ఆమె అందించిన విశేష సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ ఉన్నతాధికారులు డాక్టర్ ప్రియాంక వర్గీస్ (సిసిఏఫ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్) వంటివారు హాజరై, అలేఖ్యను అభినందించారు.
అలేఖ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, అడవుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో అడవుల పరిరక్షణ కోసం మరింత కృషి చేస్తానని అలేఖ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారని అధికారులు ఈ సందర్భంగా ప్రశంసించారు.


