ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పాంగ్రీ గ్రామ సర్పంచ్ ఆకాష్ పాటిల్ కోరారు. బైంసా మండలంలోని పాంగ్రీ గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ బాబు, వార్డు సభ్యులు దేవజీ, సాయినాథ్, కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.












