ప్రతి నీటి బొట్టు జీవానికి మూలమని, దానిని సంరక్షించడం మనందరి బాధ్యత అని మంజుల పత్తిపాటి తన రచన ద్వారా తెలియజేశారు. నిశీధిలో వినిపించే జలధారల సవ్వడి, భూమి హృదయాన్ని ఆనందంతో నింపుతుందని ఆమె వర్ణించారు. ప్రతి నీటి చుక్కలో అనంతమైన ఆశలు దాగి ఉంటాయని, దానిని వృధా చేస్తే కాలమే ప్రశ్నిస్తుందని పత్తిపాటి పేర్కొన్నారు.
ప్రకృతి ఆర్తనాదం చేస్తుందని, ఆ స్వరాన్ని అర్థం చేసుకున్న మనిషి జలాన్ని దేవతగా భావించి కాపాడతాడని ఆమె తెలిపారు. ఇంటి గడప వద్ద జారే ఒక చుక్క నుంచి ప్రపంచ ప్రవాహాల వరకూ, నీటి సంరక్షణ అనే చిన్న నిర్ణయం విశాలమైన మార్పుకు మార్గదర్శకం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.
జలమే కాదు, మనసాక్షి కూడా అదేనని, దానిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని పత్తిపాటి ఉద్ఘాటించారు. చుక్కను దాచిన వేళ చరిత్ర నిలుస్తుందని, ప్రకృతికి మనం ఇచ్చే అతి పెద్ద కానుక నీటి సంరక్షణ అని ఆమె పేర్కొన్నారు.
నీటిని ప్రతి ఒక్కరూ ఆదా చేయాలని కోరుకుంటూ, ఈ రచన ద్వారా మంజుల పత్తిపాటి నీటి సంరక్షణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్ నంబర్ 9347042218.








