హన్మకొండ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలనే చివరి కోరిక తీరిన 20 రోజులకు చిన్నారి నిరంజన్ తుది శ్వాశ విడిచాడు. హన్మకొండలో నెలకొన్న ఈ విషాద ఘటనతో అంతా చలించిపోయారు. గత నెల 17న, నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, హన్మకొండ వెళ్లి నిరంజన్ ను పరామర్శించి, అతనితో కాసేపు గడిపి సంతోషపరిచారు. అంతేకాకుండా, నిరంజన్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం కూడా అందించారు.
జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతూ, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలనే చివరి కోరిక తీరిన 20 రోజులకు చిన్నారి నిరంజన్ తుది శ్వాశ విడిచాడు. హన్మకొండలో నెలకొన్న ఈ విషాద ఘటనతో అంతా చలించిపోయారు.
గత నెల 17న, నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, హన్మకొండ వెళ్లి నిరంజన్ ను పరామర్శించి, అతనితో కాసేపు గడిపి సంతోషపరిచారు. అంతేకాకుండా, నిరంజన్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం కూడా అందించారు.
అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్, ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను కలవాలని అభిలషించాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
నిరంజన్ తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రాంగోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు.
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్, అతనితో చాలా సమయం గడిపారు. లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయిన ఆయన, అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారిని అనుకరిస్తూ చేసిన డాన్సుల వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు.
నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి యజమానుల అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకోగా, గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పారు. వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు.












