గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ఎమ్4 ప్రతినిధి ముధోల్

గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లో 80 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సిసి రోడ్డు -డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కనీస అవసరాలైన సిసి రోడ్లు -డ్రైనేజీ నిర్మాణం -తాగునీరు రహదారుల నిర్మాణం వంటి సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి లక్ష్మీ నర్సాగౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, రిటైర్డ్ ఉపాధ్యాయులు దేవా రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, బిజెపి నాయకులు తాటివార్ రమేష్, మదన్ మోరే, మోహన్ యాదవ్, సపటల్లో పోతన్న, ధర్మపురి శ్రీనివాస్, బి. సాయినాథ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment