నిజామాబాద్, జూలై 19
స్థానిక తల్లావజల మహేష్‌బాబు నివాసంలో ఆదివారం సువర్ణాధ్యాయం పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సభకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మాజీ సంచాలకులు సువర్ణ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభినవ పోతన పద్యకవి విశారదులు తల్లావజల మహేష్‌బాబు అధ్యక్షత వహించారు.
స్థానిక తల్లావజల మహేష్‌బాబు నివాసంలో ఆదివారం సువర్ణాధ్యాయం పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మాజీ సంచాలకులు సువర్ణ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సభకు అభినవ పోతన పద్యకవి విశారదులు తల్లావజల మహేష్‌బాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా తల్లావజల మహేష్‌బాబు మాట్లాడుతూ విద్యారంగంలో సువర్ణ వినాయక్ నాలుగు దశాబ్దాలపాటు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. పాఠ్యపుస్తకాల రూపకల్పన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జిల్లా స్థాయి శిక్షణ వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సువర్ణ వినాయక్ సేవలను ప్రశంసిస్తూ రచించిన పద్యాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు.
ముఖ్య అతిథి సువర్ణ వినాయక్ మాట్లాడుతూ విద్యారంగంలో తన సేవలను గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనతో కలిసి పనిచేసిన జిల్లా స్థాయి శిక్షకులు, విద్యావేత్తలు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠ్యపుస్తక రచయిత, జిల్లా స్థాయి శిక్షకుడు డాక్టర్ గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ సువర్ణ వినాయక్ విద్యారంగానికి చేసిన సేవలు ఆదర్శప్రాయమని, నిజామాబాద్ జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా స్థాయి శిక్షకులు సువర్ణ వినాయక్‌ను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రచయిత్రి డాక్టర్ శారద హనుమాన్లు, బీసీ సంఘం నాయకుడు వినోద్, గంగపుత్ర సంఘం నాయకుడు కిషన్, పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి. రమణాచారి, ప్రధానోపాధ్యాయులు ఇందూర్ బాబు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, సేనాపతి, భాషా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.











