ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసిన అధికారులు, విద్యార్థుల విజయానికి ప్రోత్సాహం అందించినందుకు ఆమెకు పూల మొక్కలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉత్తమ ఫలితాల వెనుక అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి ఉందని అన్నారు. ఇది అందరి కృషి ఫలితమని, భవిష్యత్తులో విద్యారంగంలో జిల్లాను మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, ఇతర అధికారులు, అధ్యాపకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.










