నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఆధ్వర్యంలో, ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీ భాషిత పాఠశాల 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రచార పత్రిక (బ్రోచర్) ఆవిష్కరణ కార్యక్రమం నిజామాబాద్‌లోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పాఠశాలలు సమాజానికి ఉత్తమ పౌరులను అందించే కేంద్రాలుగా ఉండాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచేలా తీర్చిదిద్దడం పాఠశాలల ప్రధాన బాధ్యత అని తెలిపారు.
అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని, విద్యార్థుల భవిష్యత్తుపై యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ అభినందనీయం అని అన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ సుందర్ పాఠశాల ప్రణాళికలు, ఆధునిక బోధన విధానాలు, డిజిటల్ లెర్నింగ్, సైన్స్ ప్రయోగశాల, గ్రంథాలయం వంటి సదుపాయాలపై వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువల ఆధారిత బోధన అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


