సిరిసిల్ల, 2024-06-27
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు బ్రిడ్జిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం బాధాకరమని, పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. నీట్ పరీక్ష లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని అన్నారు.
యువజన కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా రాజశేఖర్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులకు క్షమాపణ చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తాయని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి రాజీనామా చేయకపోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు న్యాత నవీన్, రెడ్డిమళ్ల భాను, గుడిసె ప్రభాకర్, నాగం మురళి, శేఖర్ శౌర్య నాయక్, ఎడ్ల తిరుపతి, ధర్మపురి శ్రీనివాస్, పోగుల దేవరాజు రెడ్డి, ఎగుర్ల ప్రశాంత్, గంగోల్ల స్వామి, చుక్క రామస్వామి, దండుగుల శేఖర్, నక్క సాయి, ఎండీ సోహెల్, నక్క నవీన్, శ్యాగ కుమార్, రాగుల చరణ్, షేక్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.












