ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు పరీక్షల భయాన్ని పోగొట్టి, చదువుపై ఆసక్తిని పెంచేలా పలువురు వక్తలు సూచనలు అందించారు.
మండల విద్యాశాఖ అధికారి శ్రీ గోపిడి రమణారెడ్డి, ఎద్బిడ్ జెడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్ నరసింహ చారి, ముధోల్ జెడ్పిహెచ్ఎస్ బాలికల హెడ్మాస్టర్ శ్రీమతి గీతా మేడం, మరియు ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
వివిధ సబ్జెక్టులకు చెందిన నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, సమయపాలనతో చదువుకోవడం, మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ముఖ్యమైన అంశాలపై కూడా దృష్టి సారించారు.
ఈ అవగాహన సదస్సులో ముధోల్ మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రబింద్ర పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సాయినాథ్ సార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.


