జాతీయస్థాయిలో ఇంటిగ్రేటెడ్ క్రాఫ్ట్స్ స్కిల్స్ పై ప్రధానోపాధ్యాయురాలు జూలకంటి కృష్ణవేణి ప్రదర్శనలు :
మిర్యాలగూడ జూలై 16 (మనోరంజని తెలుగు టైమ్స్)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహు సి.సి.ఆర్.టి. సెంటర్లో పాఠశాల విద్యలు ఇంటిగ్రేటెడ్ క్రాఫ్ట్స్ స్కిల్స్ నైపుణ్యాభివృద్ధిపై జాతీయస్థాయిలో 15 రోజుల శిక్షణకార్యక్రమం నిర్వహించగాతెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందిపాడు ప్రధానోపాధ్యాయురాలు జూలకంటి కృష్ణవేణి హాజరై ప్రదర్శన ఇచ్చారు.జాతీయస్థాయిలో 60 మంది ఉపాధ్యాయులు శిక్షణలో హాజరు కాగా
తెలంగాణ నుండి 11 మంది పాల్గొన్నారు. చేతి పనులు కలలు సృజనాత్మక నైపుణ్యాలకు సంబంధించినఆకృతులను ప్రదర్శించినారు. పుస్తక జ్ఞానంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేబోనాలు,బతుకమ్మ పండుగ ప్రజలకు చైతన్య పరిచిన విద్య నౌక ప్రజాకవి గద్దర్ వేషధారణలతో అనేక రకాల ప్రదర్శనలు, జాతీయ స్థాయిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానానికి అద్దం పట్టే ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయినుండివిద్యతోపాటువిద్యార్థులఅభివృద్ధిలకు అనుగుణంగా హస్తకళలుసాహిత్యము సాంప్రదాయ పండుగలు సృజనాత్మక ఉపయోగపడేముత్యాలు విద్యార్థులకు అందించే విధంగా ఈ శిక్షణఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాదు సిసిఆర్టి సెంటర్ ఉండడంతో తెలంగాణ నుండి 11మందిజాతీయస్థాయి శిక్షణ పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడంజరిగిందన్నారు. అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.












