బఖలవాడి హైస్కూల్లో యూనిఫామ్స్,షూస్ పంపిణీ : కరుణాకర్ రెడ్డి
మిర్యాలగూడ సెప్టెంబర్ 1 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బఖలవాడి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకుయూనిఫామ్స్, షూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ అందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రహీం, నల్లమేకల వెంకయ్య, మోర్తాల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కమ్మ oపాటి శ్రీను బచ్చలకూరి సైదులు శీలం చంద్రయ్య పిడి సైదులు చంద్ర తదితరులు పాల్గొన్నారు.












