కుబీర్, జూలై 20
కుబీర్ మండలంలోని నిగ్వా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం స్వర్గీయ రాచేవాడ్ పద్మావతి స్మారకార్థం టీ-షర్టులను పంపిణీ చేశారు. రాచేవాడ్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టులు అందజేశారు.
కుబీర్ మండలంలోని నిగ్వా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం స్వర్గీయ రాచేవాడ్ పద్మావతి స్మారకార్థం టీ-షర్టులను పంపిణీ చేశారు.
రాచేవాడ్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టులను అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి కుబీర్ మండల విద్యాధికారి రాజులదేవి విజయకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి, నిగ్వా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












