నిజామాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (జి.జి. కళాశాల) పదోన్నతి పొందిన అధ్యాపకులకు స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. వీరితో పాటు డాక్టర్ ఉమా కిరణ్ (బోటనీ), డాక్టర్ ఏ. రాజేశ్ (కెమిస్ట్రీ), డాక్టర్ చంద్రశేఖర్ (మైక్రో బయాలజీ) అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి సాధించిన వారిని కూడా సన్మానించారు.
ఇటీవల పీహెచ్డీ పట్టా పొందిన అధ్యాపకులు డాక్టర్ ఏ. సుమన్, డాక్టర్ ఎం. శ్రీలేఖ, డాక్టర్ బి. దీపక్ లను కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కళాశాల అధ్యాపకులు తమ కృషి, అర్హతలతో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వకారణమని, వారి బోధన విధానం కళాశాలకు మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.










