మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
భవిష్యత్ భారత పౌరులలో ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించే బాధ్యత గురువులదేనని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ అధ్యక్ష మండలి హాస్టల్ బోర్డు కన్వీనర్ సూర్య జేమ్స్ అన్నారు. సోమవారం సిద్దిపేటలోని సీఎస్ఐ డే కేర్ సెంటర్ను సందర్శించి ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
భావి భారత పౌరులను ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారిగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ అధ్యక్ష మండలి హాస్టల్ బోర్డు కన్వీనర్ సూర్య జేమ్స్ అన్నారు.
సోమవారం సిద్దిపేటలోని సీఎస్ఐ డే కేర్ సెంటర్ను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, దైవజ్ఞానం పెంపొందేలా గురువులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ సూర్య జేమ్స్, స్థానిక సీఎస్ఐ చర్చి పాస్టర్ రేవరెండ్ సి.హెచ్. ఆంటోనీని విద్యార్థులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ రేవరెండ్ సి.హెచ్. ఆంటోనీ, గురువులు, స్థానిక సంఘ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.












