సారాంశం
బాల్కొండలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో నిధుల దుర్వినియోగం, నాణ్యత లేని విద్యా సామగ్రి పంపిణీపై పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్స్ డైరెక్టర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్య విషయాలు
- 1ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా బాల్కొండలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించిన సాంఘిక శాస్త్రం శిక్షణలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని, నాణ్యత లేని విద్యా సామగ్రిని అందిస్తున్నారని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు.
- 2బాల్కొండ కోర్స్ డైరెక్టర్ పై సస్పెన్షన్ వేటు వేయాలి: కృపాల్ సింగ్ సోడి
బాల్కొండలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో నిధుల దుర్వినియోగం, నాణ్యత లేని విద్యా సామగ్రి పంపిణీపై పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- 3కోర్స్ డైరెక్టర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- 4ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన నోటు బుక్స్ ను ఉపాధ్యాయులకు పంపిణీ చేయడం, పేద విద్యార్థులకు విద్యాసంవత్సర ప్రారంభంలో అందాల్సిన నోటు బుక్స్ ను శిక్షణ అవసరాలకు వినియోగించడం ప్రభుత్వం ఉచితంగా అందించే విద్యా సామగ్రి లక్ష్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.
మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
బాల్కొండలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో నిధుల దుర్వినియోగం, నాణ్యత లేని విద్యా సామగ్రి పంపిణీపై పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్స్ డైరెక్టర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా బాల్కొండలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించిన సాంఘిక శాస్త్రం శిక్షణలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని, నాణ్యత లేని విద్యా సామగ్రిని అందిస్తున్నారని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు.
ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన నోటు బుక్స్ ను ఉపాధ్యాయులకు పంపిణీ చేయడం, పేద విద్యార్థులకు విద్యాసంవత్సర ప్రారంభంలో అందాల్సిన నోటు బుక్స్ ను శిక్షణ అవసరాలకు వినియోగించడం ప్రభుత్వం ఉచితంగా అందించే విద్యా సామగ్రి లక్ష్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.
టీచర్ల ట్రైనింగ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్న బాల్కొండ కోర్స్ డైరెక్టర్ పై తక్షణమే చర్యలు గైకొని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.