బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
ఉపాధ్యాయులే దేశానికి నిజమైన నిర్మాతలని జిడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ సాహిత్య, సంస్కృతిక విభాగం కార్యదర్శి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బైంసాలోని కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన వేడుకల్లో విశ్రాంత ఉపాధ్యాయులు జుట్టు శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయులే దేశ నిర్మాతలని జిడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ సాహిత్య, సంస్కృతిక విభాగం కార్యదర్శి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో భాగంగా విశ్రాంత ఉపాధ్యాయులు జుట్టు శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు.
శ్రీధర్ సేవలను కొనియాడిన పాటిల్
విద్యార్థుల్లో చిన్ననాటి నుండి క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి పెంపొందించడంలో జుట్టు శ్రీధర్ కీలకపాత్ర పోషించారని జాధవ్ పుండలిక్ రావు పాటిల్ కొనియాడారు. ఇటువంటి ఉపాధ్యాయులను సన్మానించడం జీడిఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేసుకున్న సుకృతమని ఆయన అన్నారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ఇన్చార్జి సల్లాముత్యం, సూపర్వైజర్ ఆ మెడ పురుషోత్తం, ఆసుపత్రి మరియు మెడికల్ సిబ్బంది శంకర్, అభి, గంగా ప్రసాద్, ఓరుగంటి మాధవ్, ట్రస్ట్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












