ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ, ఇంటర్, ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించబడింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలు కప్పి సత్కరించారు.
జ్ఞానానికి ప్రతీకగా జ్ఞాన సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు విలాస్ గాదేవార్ చేతుల మీదుగా అందజేశారు.
విలాస్ గాదేవార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇదే పట్టుదలతో విద్యాభ్యాసాన్ని కొనసాగించి, తమ తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.











