నర్సాపూర్, జూన్ 28
నర్సాపూర్ జి మండలం గొల్లమడ గ్రామంలో బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ గురుకుల వసతి కళాశాలల్లో ఏదైనా ఒకటి మంజూరు చేయాలని కోరుతూ గొల్లమడ గ్రామ సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో విద్యా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.
నర్సాపూర్ జి మండలం గొల్లమడ గ్రామంలో బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ గురుకుల వసతి కళాశాలల్లో ఏదైనా ఒకటి మంజూరు చేయాలని కోరుతూ గొల్లమడ గ్రామ సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య వినతి చేశారు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును, ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిని కలిసి గ్రామ సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో విద్యా సౌకర్యాలు మెరుగుపడేందుకు గురుకుల కళాశాల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి, మాజీ శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి కళాశాల మంజూరుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు రాజన్న, మార్కెట్ కమిటీ ఉప చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ ఆత్మ చైర్మన్ పోత రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు అరుణ్, సీనియర్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












