మంచేరియల్, 15 July
చెన్నూర్ నియోజకవర్గంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలలో అర్థరాత్రి ఆందోళనకు దిగారు. లో వసతులు సరిగ్గా లేవని ఆరోపిస్తూ రాత్రికి రాత్రే ను మంచిర్యాలలోని ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకున్నారు. అందుబాటులో లేకపోవడంతో, వారు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖను కలిసి తమ సమస్యలను వివరించారు.
చెన్నూర్ నియోజకవర్గంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలలో అర్థరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో వసతులు సరిగ్గా లేవనే కారణంతో 17 మంది విద్యార్థులు రాత్రికి రాత్రే హాస్టల్‌ను వదిలి మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, విద్యార్థులు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖను కలిసి తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల గోడును విన్న సురేఖ, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.












