- అక్టోబర్ 3 నుండి 12 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు
- ప్రతి రోజు అమ్మవారి వివిధ అలంకారాలు భక్తులకు దర్శనం
- రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పణ
: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుండి 12 వరకు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ సృజన సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.
: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు సమయానుకూలంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు.
అక్టోబర్ 9వ తేదీన మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 3న బాలా త్రిపురసుందరిదేవి అలంకారంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు, అక్టోబర్ 12న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో ముగుస్తాయి.
ప్రతీ రోజూ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని కలెక్టర్, పోలీసు అధికారులు సూచించారు.