రత్నంపేట పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ చేసిన డాక్టర్ కౌడగాని వెంకటేష్

రత్నంపేట పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ చేసిన డాక్టర్ కౌడగాని వెంకటేష్
  1. రత్నంపేట పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ.
  2. పాఠశాల అభివృద్ధికి కౌడగాని వెంకటేష్ హామీ.
  3. విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి.

బోయినిపల్లి మండలం రత్నంపేట పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ వితరణ చేసిన డాక్టర్ కౌడగాని వెంకటేష్, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ఈ చర్య చేపట్టారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన ఇతర పనులకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను 26 నుంచి 100కు పెంచడమే లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

బోయినిపల్లి మండలం రత్నంపేట ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పట్ల డాక్టర్ కౌడగాని వెంకటేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ సంపత్ సర్ చేసిన విజ్ఞప్తి మేరకు పాఠశాలకు టేబుల్ ఫ్యాన్ అందజేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

పాఠశాలలో ప్రస్తుతం 26 మంది విద్యార్థులు ఉన్నారని, వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 100 మందికి పైగా పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే పాఠశాల పరిధిలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద టాయిలెట్లు, వంటగది, త్రాగు నీరు, ఎలక్ట్రికల్ వర్క్స్, నూతన షెడ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు.

భవిష్యత్తులో ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం గారిని గ్రామానికి తీసుకురావడం ద్వారా గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ ఆఫీసు, మహిళ భవనం, కమ్యూనిటీ హాల్, క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment