రక్తదానం ప్రాణదానంతో సమానం:
ప్రొద్దుటూరు లో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ కార్యక్రమం
ప్రొద్దుటూరు, జనవరి 8 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
ప్రొద్దుటూరు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో గురువారం అత్యవసర పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసులు అనే రోగికి రక్తం తక్కువగా ఉండటంతో, ఆయనకు A+ పాజిటివ్ రక్తం అత్యవసరంగా అవసరమైంది.
ఈ పరిస్థితిని గమనించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు వెంటనే స్పందించారు. ఫౌండేషన్ సభ్యుడు బంగి వాండ్ల ఓబులేసు స్వచ్ఛందంగా A+ పాజిటివ్ రక్తం దానం చేసి రోగికి ప్రాణదానంలో కీలక భాగంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, మునీంద్ర, కృపా అగ్ని, షారోన్, ట్రస్ట్ సుమన్ బాబు పాల్గొన్నారు. ఫౌండేషన్ వారు రక్త దాత అయిన బంగి వాండ్ల ఓబులేసు ను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రక్తదానంలో పాల్గొనదలచిన వారిని ఈ నంబర్ల ద్వారా సంప్రదించవలసిందిగా ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది:
8297253484, 9182244150.