ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆదేశాలు

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ఆదేశాలు
  • వివిధ సమస్యలపై ప్రజల నుండి ఆర్జీలు స్వీకరణ
  • దరఖాస్తుల వెంటనే పరిష్కారం కోసం చర్యలు
  • బాలశక్తి కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

Alt Name: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్న దృశ్యం

నిర్మల్ : సెప్టెంబర్ 23

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో విద్య, వైద్య, భూ సమస్యలు, పింఛన్లు వంటి అంశాలపై వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. పాఠశాల విద్యార్థుల నైపుణ్యాల పెంపుదల కోసం ప్రారంభించిన బాలశక్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.

Alt Name: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్న దృశ్యం

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కీలక ఆదేశాలు ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి విద్య, వైద్య, వ్యవసాయం, పింఛన్లు, భూ సమస్యలు, ధరణి, రెండు పడక గదుల ఇండ్లు వంటి అంశాలపై ఆర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి శాఖలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నిర్ణిత గడువులోపు పరిష్కరించాల్సిందిగా చెప్పారు. బాలశక్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఆర్వో భుజంగ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Alt Name: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్న దృశ్యం

Leave a Comment