కౌట బి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

M4 న్యూస్ (ప్రతినిధి)
బోథ్ మండలం : అక్టోబర్ 19

కౌటా బి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శశిధర్ రెడ్డి శనివారం సాయంత్రం బోథ్ మండలంలోని కౌటా భి గ్రామంలో ఉన్న బీసీ వసతి గృహంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గ్రహాలలో నివాసముంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులతో పాటు ఏకరూప దుస్తులు అందిస్తుందన్నారు.

ట్నేం: కౌటా భి బీసీ వసతి గృహం

“ప్రభుత్వం చదువుకోడానికి కావలసిన పుస్తకాలు, వసతులన్నీ కల్పిస్తోంది కాబట్టి ప్రతి విద్యార్థి ఇష్టపడి కష్టపడి చదువుకొని పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌటా భి జడ్పి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి శశిధర్ రెడ్డి, ఇన్చార్జి వార్డెన్ కృష్ణ పల్లి శ్యాంసుందర్, ఐకెపి ఎపిఎం మాధవ్, సిసి సుభద్ర, సంజీవ్, లక్ష్మి, తెలుగు పండిత్ కేదార్నాథ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 41 ఏకరూప దుస్తులు మరియు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 40 మంది విద్యార్థులకు 40 ఏకరూప దుస్తులు, మొత్తం 81 ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.

Leave a Comment