- ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రూ. 500కి గ్యాస్ సిలిండర్
- సిలిండర్ బాండ్లు 300 మందికి పంపిణీ
- రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై ప్రశంసలు
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రూ. 500కి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు బాండ్లు పంపిణీ చేశారు. దాదాపు 300 మంది లబ్ధిదారులకు బాండ్లు అందజేశారు. పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ. 500కి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుకన్య రమేష్, నాయకులు రావుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 300 మంది లబ్ధిదారులకు బాండ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుందని వారు వెల్లడించారు. పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావుల పోశట్టి, నాయకులు లోలం భూమన్న, పంచాయతి కార్యదర్శి గంగాధర్, నాయకులు పి మోహన్ రెడ్డి, మూసుకు మోహన్, అనిల్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.