లయన్స్ క్లబ్ భీమ్‌గల్–వేముగల్లు ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

లయన్స్ క్లబ్ భీమ్‌గల్–వేముగల్లు ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

మనోరంజని తెలుగు టైమ్స్ – భీమ్‌గల్ నవంబర్ 16
లయన్స్ క్లబ్ భీమ్‌గల్–వేముగల్లు ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు వెచ్చని ఆదరణ కల్పించేందుకు భీమ్‌గల్–వేముగల్లు లయన్స్ క్లబ్ ముందడుగు వేసింది. పట్టణంలోని బీసీ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమంగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పడల పురందర్ మాట్లాడుతూ—
“గరుడ చానల్‌లో బీసీ హాస్టల్‌లో దుప్పట్లు లేవని వచ్చిన వార్తను గమనించి, లయన్స్ క్లబ్ తరఫున ప్రతి విద్యార్థికి దుప్పట్లు అందించాలని నిర్ణయించాం. రేపటి పౌరులు అయిన విద్యార్థులు చలి ఇబ్బందులు మరిచి చదువుపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం,” అని తెలిపారు. క్లబ్ కార్యదర్శి గజ్జెల చైతన్య మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో ఎల్లప్పుడూ ముందుండే సంస్థగా పనిచేస్తోందని, ఈ దుప్పట్ల పంపిణీ కూడా అదే సేవలో భాగమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 30 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. హాస్టల్ ఇంచార్జి వార్డెన్ మాట్లాడుతూ—
“దుప్పట్లు విద్యార్థులకు అత్యవసరం అయిన సమయంలో లభించడం చాలా ఉపయుక్తంగా ఉంది. లయన్స్ క్లబ్ అందించిన ఈ సహాయం వారికి ఎంతో ఊరటనిస్తుంది,” అని క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఎడ్ల శేఖర్, ఉపాధ్యక్షులు హన్మాండ్లు (ప్రజా ఆస్పత్రి), ప్రసాద్ (నారాయణ స్కూల్), పిఆర్వో పురస్తు లింబాద్రి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. శ్రీకాంత్ రామావత్, సహాయ కో-ఆర్డినేటర్ భూక్యా లింబాద్రి, సభ్యులు ఇమ్మానుయేల్, ర్యాడా శ్రీనివాస్, హన్మంతు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment