రబీంద్రలో అహల్యబాయి హోల్కర్ పుస్తక-కరపత్రాలు ఆవిష్కరణ
ఎమ్4 ప్రతినిధి ముధోల్
అహల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ముధోల్లోని రభింద్ర ఉన్నత పాఠశాలలో అహల్యబాయి హోల్కర్ పుస్తక- కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పాల ప్రసాద్ చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ అహల్య బాయి హోల్కర్ 300 సంవత్సరాల క్రితమే మహళల సాధికారిత కోసం ఆలోచించారని, సాంఘిక దురాచారాల మీద గళం విప్పి తన రాజ్యంలో వాటికి స్థానం లేకుండా శాసనాలు తెచ్చారని తెలిపారు. భారతదేశంలో ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించినా వారి ధర్మసత్రాలు దర్శనమిస్తాయని ఆయన చెప్పారు. అదేవిధంగా మొగలుల దాడిలో ధ్వంసమైన కాశీ, అయోధ్య- సోమనాథ్ లాంటి వందల ఆలయాలను పునరుద్దరించారని, 300 సంవత్సరాల క్రితమే మహిళ సైనిక దళం నిర్మాణం చేసి మహిళలు ఎందులోనూ తక్కువకారని సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారన్నారు. కుటుంబంలో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా చనిపోయినా కంగుబాటుకు లోనూ కాకుండా తన మామ నుండి వచ్చినటువంటి రాజ్యాన్ని అందరి మన్నలు పొందే విధంగా పాలించారని, కుల, మత, వర్గ బేధం లేకుండా అందర్ని ఒకే సమూహంగా చూపారని, వీరి చరిత్ర అందరికే తెలియాలనే ఉద్దేశ్యంతో సామాజిక సమరసత వేదిక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హాసన్ అసంవార్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ముధోల్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుంజలోళ్ళ నారాయణ, కోశాధికారి మేత్రి సాయినాథ్, విభాగ్ బాధ్యులు అల్లాడి సూర్యనారాయణ, సంయోజక్ సూర్యకాంత్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.