आంధ్రప్రదేశ్, 2026-07-22
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, బుధవారం జారీ చేయాల్సిన ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో, రేపటి (గురువారం) దర్శనాలకు సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసింది. అయితే, శుక్రవారం దర్శనం కోసం రేపు మధ్యాహ్నం నుంచి టోకెన్ల జారీ యథావిధిగా కొనసాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు కేటాయించిన టోకెన్ల కోటా గంట వ్యవధిలోనే పూర్తయింది. దీనితో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.











