21 ఏప్రిల్ 2026, మంగళవారం నాడు మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి సంబంధించిన ఫలాలు ఇక్కడ వివరించబడ్డాయి. ప్రతి రాశికి సంబంధించిన శుభ, అశుభ ఫలితాలు, వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైన సూచనలు ఇవ్వబడ్డాయి.
మేష రాశి వారికి ఈ రోజు నూతన వస్తు వాహన లాభాలు, బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృషభ రాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
మిధున రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
కర్కాటక రాశి వారికి సమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఋణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.












