మిర్యాలగూడ, 2026-08-18
యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కళాభారతిలో ఆదివారం జరిగిన నృత్య ప్రదర్శనలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిన్నారి మహోన్నత ప్రతిభ కనబరిచింది. ఆమెకు ఆలయ కమిటీ వారు మెమొంటోను అందజేశారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన సిరిసిరిమువ్వ నాట్యాలయ గురువు కలకొండ రాము ఆధ్వర్యంలో చిన్నారులు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కళాభారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాగిరెడ్డి నవీన్ రెడ్డి, సరితల కుమార్తె మహోన్నత ప్రతిభ కనబరచగా, ఆలయ కమిటీ వారు ఆమెకు మెమొంటోను అందజేశారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు వచ్చిన భక్తులను అలరించారు.






