చిత్తూరు, 2026-06-05
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగకర్తలు, పండితులు తెరదించారు. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం నాడు ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచేశారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు సూచిస్తున్నారు.
సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ( ) పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగకర్తలు, పండితులు తెరదించారు. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం నాడు ఈ పండుగను జరుపుకోవాలని వారు స్పష్టంచేశారు. రాఖీ కట్టేందుకు ఉదయం వేళ అత్యంత శ్రేష్ఠమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. హిందూ పంచాగం ప్రకారం.. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28, శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది.
పౌర్ణమి తిథిపై స్పష్టత
శాస్త్రోక్తంగా సూర్యోదయం సమయంలో ఉన్న తిథిని (ఉదయ తిథి) ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి 28వ తేదీనే పౌర్ణమిగా పరిగణించాల్సి ఉంటుందని పండితులు తెలిపారు. దీనికి తోడు 27వ తేదీన ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటంతో ఆ రోజున శుభకార్యాలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని వారు పేర్కొంటున్నారు. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం రాఖీ కట్టేందుకు అత్యంత శుభ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు.
ముఖ్య నగరాల్లో ముహూర్తాలు
ఢిల్లీలో ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల మధ్య రాఖీ కట్టడానికి అనువైన సమయం. ముంబై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో సూర్యోదయ సమయాలను బట్టి ముహూర్తాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితమైన సమయాల కోసం స్థానిక పంచాంగాలను సంప్రదించడం ఉత్తమమని వారు సూచించారు.
చంద్రగ్రహణం ప్రభావం ఉండదు
అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారతదేశంలో గోచరించదు. చంద్రుడు క్షితిజం కంటే దిగువన ఉండటం వల్ల ఈ గ్రహణం మనకు కనిపించదు. ఫలితంగా గ్రహణానికి సంబంధించిన సూతక నియమాలు వర్తించవని, ఎలాంటి ఆటంకాలు లేకుండా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు స్పష్టతనిచ్చారు.
సంప్రదాయం ప్రకారం వేడుకలు
ఈ శుభ తరుణంలో సోదరీమణులు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి, రాఖీ కట్టి వారి ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ సోదర బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం.












