బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
బోథ్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఆదివారం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బోథ్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఆదివారం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతాంగ అభ్యున్నతి కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రంగు రాజు, ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెడిచెల్మ ప్రవీణ్, మాజీ అధ్యక్షుడు పాలిక్ రమేష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు రఘుపతి, ప్రసాద్, పాలిక్ సంతోష్, లక్ష్మణ్, శంకర్ టీచర్, సాగర్, ఉపాధ్యక్షులు రూపేష్, పాపేశ్వర్, వేణు, లక్ష్మణ్, అల్లిదాస్, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మహిళలు తదితరులు పాల్గొన్నారు.











