కామారెడ్డి జిల్లా లింగంపేటలో శ్రీశ్రీశ్రీ ఉత్తర శబరిమళ అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు.
ఆలయ కమిటీ సభ్యులు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు.
మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడానికి స్థానిక భక్తులు, గ్రామస్తుల సహకారాన్ని కోరారు. అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమ రూపకల్పనలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో స్వాములు భీమ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమేష్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











