ఖానాపూర్, 2026-08-05
ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి శ్రావణ మాసంలో భాగంగా పంచామృత అభిషేకంతో పాటు విశేష అలంకరణ నిర్వహించారు. శ్రావణ మాస శనివారం సందర్భంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఖానాపూర్, ఆగస్టు: శ్రావణ మాసంలో భాగంగా సత్తెనపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకంతో పాటు విశేష అలంకరణ నిర్వహించారు. శ్రావణ మాస శనివారం సందర్భంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఆలయ అర్చకుల సూచన
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వైదిక పురోహితులు శ్రీ నర్రా నితీష్ మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, మంగళవారం, శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.












