ఖానాపూర్, జూలై 19
ఉత్తరాఖండ్ నుంచి పూరీ జగన్నాథ ఆలయానికి పాదయాత్రగా వస్తున్న నాగసాధువులు ఆదివారం ఖానాపూర్లో ఆధ్యాత్మిక సందడి చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ వీరాంజనేయ శివసాయి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తరాఖండ్ నుంచి పూరీ జగన్నాథ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన నాగసాధువులు ఆదివారం ఖానాపూర్లో ఆధ్యాత్మిక సందడి చేశారు. ముందుగా ఉత్తరవాహిని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు, అనంతరం పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివసాయి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కొక్కుల ప్రదీప్, ప్రధాన పూజారి శశికుమార్ నాగసాధువులకు ఘన స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం నాగసాధువులు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం నాగసాధువులు మాట్లాడుతూ, ఖానాపూర్ నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడి నుంచి పూరీ జగన్నాథ ఆలయానికి తమ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నాగసాధువుల రాకతో ఆలయంలో భక్తిపూరిత వాతావరణం నెలకొంది.











