నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు బాసరకు చెందిన బాలనటుడు గురప్పు మణికంఠ కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు.
ఆలయ అధికారులు సత్కారం
ఆలయానికి చేరుకున్న దర్శకుడు హరీష్ శంకర్‌కు వైదిక బృందం ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం ఆలయ అధికారులు ఆయనను శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.








