బాసర, 2026-08-23
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శ్రావణమాసం ఆదివారం సెలవుదినం, ఏకాదశి, మూలా నక్షత్రం కలిసి రావడంతో భక్తులు పోటెత్తారు. శుభదినంగా భావించిన భక్తులు చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు చేయించేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శ్రావణమాసం ఆదివారం సెలవుదినం, ఏకాదశి, మూలా నక్షత్రం కలిసి రావడంతో భక్తులు పోటెత్తారు. శుభదినంగా భావించిన భక్తులు చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు చేయించేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బాసరకు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడాయి.
ఆలయ వర్గాల వెల్లడి
అక్షర శ్రీకర పూజకు సుమారు రెండు గంటలు, సర్వదర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లు, దర్శనం, అక్షరాభ్యాస మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.












