బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్మించ తలపెట్టిన శివ రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గురువారం స్థానికులకు అందజేశారు. ఎన్నికల హామీ మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్మించ తలపెట్టిన శివ రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. గురువారం బైంసాలోని తన నివాసంలో స్థానికులకు మంజూరు పత్రాన్ని అందజేశారు.
గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్ చింతపండు రజిత మహేష్ మాట్లాడుతూ, భైంసా పట్టణంలో రామ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం శుభసూచకమని, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాయంలోనే బైంసా పట్టణంలో అనేక అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం జరిగిందని కొనియాడారు.
అనంతరం నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను కౌన్సిలర్‌తో పాటు కాలనీవాసులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రావుల రాము, కౌన్సిలర్ అమోల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.












