- అబ్దుల్లాపూర్‌లో మోక్ష గణపతికి ఘన ఉత్సవాలు
- 11 రోజుల పాటు పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు
- భక్తులు దక్షిణ, ఉత్తర భారతం నుంచి తరలివచ్చి గణపతి దర్శనం
- కర్రతో తయారుచేసిన ప్రత్యేక గణపతి విగ్రహం
నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్రతో ప్రత్యేకంగా తయారు చేసిన మోక్ష గణపతికి ఈ ఏడాది కూడా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దక్షిణ, ఉత్తరాదినుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. గ్రామస్థుల ఐక్యతకు ఈ ఉత్సవం నిదర్శనంగా నిలుస్తోంది.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామం ఐక్యతకు, భక్తి పౌరాణికతకు ప్రసిద్ధి గాంచిన గ్రామంగా పేరు తెచ్చుకుంది. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా మోక్ష గణపతిని ప్రతిష్టిస్తూ, 11 రోజుల పాటు నిరంతర పూజలు నిర్వహిస్తారు. గతేడాది నుంచి గ్రామస్తులు పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో కర్రతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించి పూజలందిస్తున్నారు.
ఈ మోక్ష గణపతిని దర్శించుకోవటానికి దక్షిణ మరియు ఉత్తర భారతదేశం నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తున్నారు. గ్రామంలోని ఐక్యతను ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తులందరికీ ఒకే చోట భక్తిపారవశ్యాన్ని అందిస్తాయి.