- తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
- లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు.
- సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు.
తిరుమల లడ్డూ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం పక్కా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న టీటీడీ బోర్డు ఈ వివాదంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక, సనాతన ధర్మ రక్షణకు సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన అంశాలను కాపాడటం కోసం జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ధార్మిక పద్ధతులను కాపాడేందుకు, అన్ని వర్గాల వారితో చర్చ జరగాలని సూచించారు. సనాతన ధర్మానికి ఏ రూపంలోనైనా ముప్పు వాటిల్లినప్పుడు అందరూ కలిసికట్టుగా ఆత్మరక్షణలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.