యూట్యూబ్ లో చూసి అత్తను అతికిరాతకంగా హత్య చేసిన కోడలు?*

*యూట్యూబ్ లో చూసి అత్తను అతికిరాతకంగా హత్య చేసిన కోడలు?*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

విశాఖ జిల్లా: నవంబర్09
విశాఖపట్నంలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి సంచలనం సృష్టిం చింది, కేవలం కుటుంబ కలహాలు చిరాకుల కారణం గా ఓ కోడలు అత్యంత కిరాతకంగా తన అత్తను హత్య చేసింది…చాదస్తం, సూటిపోటి మాటలతో విసిగిపోయిన ఓ కోడలుఈ దారుణానికి ఒడిగట్టింది.

ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం యూట్యూబ్‌లో హత్యలు చేసే పద్ధతులను చూసి, పక్కా ప్రణాళికతో అత్తను సజీవదహనం చేసింది. ఈ ఘోరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేం దుకు ప్రయత్నించినా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయట పడింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితురాలైన కోడలిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం తన తల్లి కనకమహాలక్ష్మి (63), భార్య లలితాదేవి (30), ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి లలితా దేవి భర్త సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లిన సమయంలో లలితా తన పథకాన్ని అమలు చేసింది.

పిల్లలతో ‘దొంగా పోలీస్’ ఆట ఆడుదామని అత్త కనకమహాలక్ష్మిని నమ్మించింది. ఆటలో భాగంగా, వాలుకుర్చీలో కూర్చున్న అత్త కళ్లకు చున్నీతో గంతలు కట్టి, చేతులు, కాళ్లను తాళ్లతో బంధించింది. అనంతరం, ముందుగా కొని దాచిపెట్టిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకుని కనకమహాలక్ష్మి అక్కడికక్కడే సజీవదహన మయింది.

నానమ్మ అరుపులు విని పరుగెత్తు కొచ్చిన కుమార్తె కు కూడా మంటలు అంటు కుని గాయాలయ్యాయి.ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు లలితాదేవి నాటకమా డింది. ఇంట్లో టీవీ పేలి ప్రమాదం జరిగిందంటూ గట్టిగా అరుస్తూ ఇరుగు పొరుగు వారిని పిలిచింది. వారు వచ్చి చూసి అగ్ని ప్రమాదంగానే భావించారు.

అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్‌ లో పెట్రోల్ వాసన రావ డంతో అనుమానించారు. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించి లలితాదేవి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. ఆమె యూట్యూబ్ హిస్టరీలో ‘హత్య చేసి తప్పించుకోవడం ఎలా?’ వంటి వీడియోలు ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో, భర్త సుబ్రహ్మణ్యం కూడా తన భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు.

దీంతో పోలీసులు లలితా దేవిని తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. అత్త చాదస్తంతో, సూటిపోటి మాటలతో వేధిస్తుండటం తోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. మృతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment