తిరుపతిలో దర్శనం
తిరుపతి, జనవరి 09 (మనోరంజని తెలుగు టైమ్స్):
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మాజి జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్‌తో పాటు సాయి నాథ్ యూత్ సభ్యులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ గౌడ్, నరేందర్ గౌడ్, సతీష్, వెంకట్ గౌడ్, మైపాల్ రెడ్డిలు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు.
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో వారు భక్తి భావంతో గడిపారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరిగింది.